Namaste NRI

తెలుగు రాష్ట్రాలలో ఆటా వేడుకలు

ఈ నెల 6వ తేదీ నుంచి 26వ తేదీ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌  రాష్ట్రాల్లో అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో ఆటా వేడుకలను నిర్వహిస్తున్నట్టు అమెరికా తెలుగు సంఘం ఆధ్యక్షుడు భువనేష్‌ భూజాల తెలిపారు. అబిడ్స్‌లోని స్టాన్లీ కళాశాలలో ఆటా వేడుకల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భువనేష్‌ భూజాల మాట్లాడుతూ వచ్చే ఏడాది జూలై 1 నుంచి 3వ తేదీ వరకు వాషింగ్టన్‌ డీసీ ఈ`కన్వెన్షన్‌ సెంటర్‌లో 17వ ఆటా మహాసభలను తెలుగు వారి ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించేలా నిర్వహిస్తున్నామన్నారు. అంతకు ముందు మన రెండు రాష్ట్రాల్లో ఆటా వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు.  డిసెంబర్‌ 6వ తేదీన వనపర్తి జిల్లాలో వెటర్నరీ వైద్యశాల ప్రారంభించడంతో ఈ వేడుకలు మొదలవుతాయన్నారు.  7వ తేదీన నల్లగొండలో వైద్య శిబరం, 8వ తేదీన భువనగిరిలో ఆరోగ్య,  నేత శిబిరాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. డిసెంబర్‌ 18వ తేదీన తిరుపతిలో ఆటా సాంస్కృతిక కార్యక్రమం, రెండు తెలుగు రాష్ట్రాల సాహితీవేత్తలతో సదస్సు తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.

                డిసెంబర్‌ 26వ తేదీన రవీంద్రభారతిలో ఆటా నాదం గ్రాండ్‌ ఫినాలే  పాటల పోటీతో వేడుకలను ముగిస్తామన్నారు. ఆటా మహోత్సవం, వివిధ రంగాల నిపుణులకు సత్కారం, జీవిత సాఫల్య పురస్కారాలను ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో  ఆటా ఇండియా కో ఆర్డినేటర్‌ జోత్స్నారెడ్డి, మాజీ అధ్యక్షుడు కరుకణాకర్‌ రెడ్డి, సలహాదారులు గౌతమ్‌ గోలీ, తిరుపతి రెడ్డి, జాయింట్‌ సెక్రెటరీ రామకృష్ణారెడ్డి, ఉత్సవ కన్వీనర్‌ సుధీర్‌ బండారు, ఆటా బోర్డు ఆఫ్‌ ట్రస్టీ అనీల్‌ బోది, ప్రతినిధి హరి దామెర పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events