స్వర్గీయ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మొదటి వర్ధంతి సందర్భంగా అమెరికా తెలుగు సంఘం (ఆటా), డల్లాస్, టెక్సాస్ శాఖల సభ్యులు ఘనంగా నివాళి అర్పించారు. బాలు గాన సుధాస్ృమతి పేరుతో సంగీత కార్యక్రమాన్ని నిర్వహించి గానగంధర్వుడిని స్మరించుకున్నారు. ఇందులో భాగంగా తెలుగు చిత్రసీమ సంగీత దర్శకుల సారథ్యంలో బాలు ఆలపించిన మధురమైన పాటలను రాజశేఖర్ సూరిభొట్ల, సంతోష్ ఖమ్మామ్కర్, జానకి శంకర్, సాయి రాజేష్ మహాబాష్య, సృజన ఆడూరి, ప్రభాకర్ కోట, చంద్రహాస్ మద్దుకూరి, శిరీష కోటంరాజు, నాగి వడ్లమన్నాటి, బాలాజీ నరసింహన్, వీణ యలమంచలి, జ్యోతి సాదు, మల్లిక సూర్యదేవర, రోషిని బుద్ధ ఎంతో కమనీయంగా ఆలపించారు. బాలు పాడిన సుమారు 50కి పైగా గీతాలను ఆలపించారు. ఆటా సంస్థకు బాలుకు ఉన్న సంబంధం విడదీయరానిదని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి శారద సింగిరెడ్డి, రవి తూపురాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
1992లో న్యూయార్క్లో జరిగిన ఆటా రెండో మహాసభల, 2014లో పెన్సిల్వేనియాలో జరిగిన 13వ ఆటా మహాసభలో బాలు సంగీత విభావరి నిర్వహించారని, 2000లో అట్లాంటాలో జరిగిన ఆరో ఆటా మహాసభల్లో బాలుకు జీవనసాఫల్య పురసారం అందజేసినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు భువనేశ్ బుజాల, మధు బొమ్మినేని, అరవింద్ రెడ్డి, సతీష్ రెడ్డి, శారద సింగిరెడ్డి, రామ్ అన్నాడి, సంధ్య గవ్వ, అనంత్ రెడ్డి పజ్జూర్, మహేశ్ మానపురి, సుమనసారెడ్డి, మంజురెడ్డి తదితరులు పాల్గొన్నారు.














