Namaste NRI

ఏటీఎమ్‌ వెబ్‌ సిరీస్‌ లాంఛ్‌

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు తొలిసారిగా నిర్మిస్తున్న వెబ్‌ సిరిస్‌ ఏటీఎమ్‌. జీ5 సంస్థతో కలిసి దర్శకుడు హరీష్‌ శంకర్‌ నిర్మాణంలో భాగమవుతున్నారు.  తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.  ముహూర్తపు సన్నివేశానికి దిల్‌ రాజు క్లాప్‌ నిచ్చారు. ఇందులో బిగ్‌ బాస్‌ విన్నర్‌ వీజే సన్నీ, దివి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ వెబ్‌ సిరీస్‌తో నిర్మాతలుగా మారుతున్నారు. దిల్‌ రాజు ప్రొడక్షన్‌ పతాకంపై థ్రిల్లర్‌ కథతో దర్శకుడు సి.చంద్ర మోహన్‌ తెరకెక్కిస్తున్నారు.   త్వరలో ఈ వెబ్‌ సిరీస్‌ పూర్తి వివరాలు వెల్లడిరచనున్నారు. ఈ చిత్రానికి సినిమాలో గ్రఫీ: పీజీ విందా, సంగీతం : ప్రశాంత్‌ విహారి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events