అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సూపర్‌మార్కెట్ నిర్వహిస్తున్న భారత యువకుడిని దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. అమెరికా పోలీసులు నిందితుడిని క్రిస్ కోప్‌ల్యాండ్ (26)గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన జార్జియాలో చోటు చేసుకుంది. భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం కపుర్తలా జిల్లా ధాపై గ్రామానికి చెందిన పరమ్‌వీర్ సింగ్ అమెరికాలోని జార్జియాలో గత కొంతకాలంగా సూపర్‌మార్కెట్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో నల్లజాతీయుడైన క్రిస్ కోప్‌ల్యాండ్ (26) పట్టపగలు తుపాకీతో పరమ్‌వీర్ నిర్వహిస్తున్న సూపర్ మార్కెట్‌ల్లోకి ప్రవేశించాడు. అతడిని బెదిరించి డబ్బులు తీసుకున్నాడు. అనంతరం పరమ్‌వీర్‌పై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గాయపడిన పరమ్‌వీర్ సింగ్ అక్కడికక్కడే కుప్పకూలాడు. ఆ తర్వాత క్రిన్ కౌంటర్ వద్ద ఉన్న కంప్యూటర్ పరికరాలను ధ్వంసం చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. జార్జియా పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి అక్కడి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు క్రిస్‌ను అదుపులోకి తీసుకున్నారు.