
చైనా లో శిక్షణ ఇచ్చేందుకు వెళ్లిన నలుగురు కాలేజీ సిబ్బందిపై అటాక్ జరిగింది. పబ్లిక్ పార్క్‌లో ఉన్న సమయంలో ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అమెరికాలోని ఐయోవా కార్నల్ కాలేజీకి చెందిన ఇన్‌స్ట్రక్టర్లు, ఓ ప్రోగ్రామ్ నేపథ్యంలో చైనాకు వెళ్లారు. జిలిన్ ప్రావిన్సులో ఉన్న పార్క్‌ను నలుగురు టీచర్లు విజిట్ చేసిన సమయంలో అక్కడ దాడి జరిగింది. బెయిషాన్ పార్క్ సమీపంలో ఉన్న ఓ ఆలయాన్ని విజిట్ చేసినప్పుడు ఓ వ్యక్తి కత్తితో అటాక్ చేశాడు. చైనా వర్సిటీతో భాగస్వామ్యంలో భాగంగా శిక్షణ కోసం తమ కాలేజీకి చెందిన నలుగురు అక్కడకు వెళ్లినట్లు కార్నల్ కాలేజీ తెలిపింది. ముగ్గురు వ్యక్తులు రక్తపు మడుగులో కిందపడి ఉన్నారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు చైనా అధికారులు స్పందించలేదు.
