ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపై రాకెట్ దాడి జరిగింది. పట్టిష్ట భద్రత నడుమ గ్రీన్‌జోన్‌లో ఉన్న ఎంబసీపైకి ఓ రాకెట్ దూసుకొచ్చింది. అయితే దానిని గుర్తించిన యాంటీ రాకెట్ సిస్టం.. ఆ రాకెట్‌ను దారి మళ్లించింది. కాగా, కొద్దిసేపట్లోనే మరో రాకెట్ ఎంబసీకి సమీపంలో పడిరదని విశ్వసనీయ వర్గాలు వెల్లడిరచాయి. అయితే ఈ దాడులవల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని భద్రతాధికారులు తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)