Namaste NRI

ప్రేక్షకులు టెన్షన్స్‌ మరచిపోతారు : సుధీర్‌బాబు

సుధీర్‌బాబు  కథానాయకుడిగా హర్షవర్ధన్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం మామా మశ్చీంద్ర. సునీల్‌ నారంగ్‌, పూస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మాతలు. ఈ నెల 6న విడుదలకానుంది. ఈ సినిమా ప్రీరిలీజ్‌ వేడుకకు నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ అమ్మకు సంబంధించిన కథ ఇది. హృదయాన్ని కదిలించే ఎమోషన్స్‌ ఉంటాయి అన్నారు. మూడు గెటప్స్‌లో హీరో సుధీర్‌ నటన ప్రత్యేకాకర్షణగా నిలుస్తుందని నిర్మాతలు తెలిపారు. హర్షవర్ధన్‌ కామెడీ టైమింగ్‌ బాగుంటుందని, ఈ సినిమా ద్వారా అతను దర్శకుడిగా పేరు తెచ్చుకుంటాడని ముఖ్య అతిథిగా విచ్చేసిన శేఖర్‌ కమ్ముల పేర్కొన్నారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ ఈ సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లుంటాయి. నేను మూడు పాత్రల్లో కనిపిస్తా. కథలో కొత్తదనంతో పాటు వినోదం కూడా మరో స్థాయిలో ఉంటుంది. ఈ సినిమా చూస్తూ ప్రేక్షకులు టెన్షన్స్‌ అన్నింటిని మరచిపోతారు అన్నారు.   ఈ కార్యక్రమంలో హీరోలు విశ్వక్‌సేన్‌, శ్రీవిష్ణు, శర్వానంద్‌ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events