ఇజ్రాయెల్-గాజాల మధ్య జరుగుతున్న యుద్ధంలో వేలాది మంది పాలస్తీనీయన్‌లు మరణించారు. చాలా మంది శరణార్థులుగా పునరావాసం కోరుతూ పలు దేశాలకు వీసాల కోసం దరఖాస్తు చేసుకొంటున్నారు. ఆస్ట్రేలియా వీసా కోసం కూడా పలువురు పాలస్తీనియన్‌లు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆ దరఖాస్తులను ఆస్ట్రేలియా తిరస్కరిస్తున్నది. పాలస్తీనియన్‌లు ఆస్ట్రేలియా వీసా కోసం చేసుకున్న దరఖాస్తులు ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నాయని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో ఆస్ట్రేలియా ఇజ్రా యెల్ పౌరుల వీసా దరఖాస్తులకు మాత్రం ఆమోదం తెలుపుతుండటం గమనార్హం. ఇప్పటివరకు 10 వేల మంది పాలస్తీనియన్‌లు ఆస్ట్రేలియా వీసాకు దరఖాస్తు చేసుకున్నారని ఆ దేశ హోంమంత్రి టోనీ బుర్కో పేర్కొన్నారు.
10,033 మంది పాలస్తీనియన్‌లు ఆస్ట్రేలియా వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 2,922 వీసాలు ఆమో దం పొందగా 7,111 తిరస్కరణకు గురయ్యాయి. ఇక ఇజ్రాయెల్ పౌరుల వీసా దరఖాస్తుల్లో 235 దరఖాస్తులను తిరస్కరించగా 8,646 ఆమోదం పొందాయి. ఇటీవల ఆస్ట్రేలియా సంకీర్ణ పార్లమెంటు సభ్యులు నిర్వహించిన సమావేశంలో హమాస్‌కు మద్దతు ఇవ్వటం లేదని నిర్ధారించాలనుకున్నారు.