ఆస్ట్రేలియా ప్రభుత్వం భారతీయులకు శుభవార్త అందించింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ ప్రకటన చేశారు. ఏడాది కాలంగా ఇండియన్ల రాకపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుంచి స్టూడెంట్ వీసా, స్కిల్డ్ వర్క్ వీసా ఉన్న వారు ఆస్ట్రేలియాకు వచ్చేందుకు అనుమతి ఇస్తున్నారు. అయితే అంతకంటే ముందే సదరు వ్యక్తులు ఆయా దేశాల్లో రెండో డోసులు కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఉండాలి. దీనికి సంబంధించిన ధ్రువపత్రాలను ప్రయాణం సందర్భంగా చూపించాల్సి ఉంటుంది. అదే విధంగా ఆస్ట్రేలియా చేరుకున్న తర్వాత స్థానికంగా ఉన్న క్వారంటైన్ నిబంధనలు పాటించాలని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది.