ఆన్‌షోర్ స్టూడెంట్ వీసా దరఖాస్తుదారులు తప్పనిసరిగా కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్‌రోల్‌మెంట్ (సీఓఈ)ని తమ దరఖాస్తుతో పాటు జత చేయాలని ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. ఈ నెల 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపింది. గతంలో దరఖాస్తు చేసినవారికి సీఓఈ అవసరం లేదని చెప్పింది. సీఓఈ లేకుండా బ్రిడ్జింగ్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా రద్దు చేసింది. ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ స్టూడెంట్ వీసా ప్రాసెస్‌లను గాడిలో పెట్టడం కోసం ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా హోం శాఖ తెలిపింది. ఆస్ట్రేలియాలో ఉంటూ స్టూడెంట్ వీసాకు మారడం కోసం ప్రయత్నించే వీసా హోల్డర్లకు కొన్ని అదనపు ఆంక్షలను విధించే అవకాశం ఉందని కూడా చెప్పింది.