
ప్రపంచవ్యాప్తంగా అవతార్ ఫ్రాంచైజీకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్, ప్రపంచ సినీ చరిత్రలో సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకూ రెండు భాగాలు విడుదలై ఘన విజయం సాధించాయి. తాజాగా మూడో భాగం అవతార్ – ఫైర్ అండ్ యాష్ నుంచి వరంగ్ పాత్ర ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈనెల 25న ట్రైలర్‌ని రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. భారీ హాలీవుడ్ చిత్రం అయిన మార్వెల్ ఫెంటాస్టిక్ ఫోర్ మూవీతో కలిపి థియేటర్లలో ప్రదర్శించనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో రెండింటిపైన ప్రేక్షకుల్లో ఆసక్తి భారీగా పెరిగింది. జేమ్స్ కెమెరూన్ తన సినిమా ప్రపంచాన్ని పంచభూతాల కాన్సెప్ట్ ఆధారంగా నిర్మిస్తున్నట్టు సమాచారం. 2025 డిసెంబరు 19న ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో అవతార్-3 విడుదల కానుంది. కాగా, అవతార్-4 2029లో, అవతార్ -5 డిసెంబరు 2031లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది.















