భారత దేశ కాలమానము ఏప్రెల్ 28 ఉదయము, అమెరికా కాలమానము ఏప్రెల్ 27 వ తారీకు సాయంత్రం, మొదటి ప్రపంచ తెలుగు సమితి, “వరల్డ్ తెలుగు కన్సార్టియం” అంతర్జాల సమావేశం అద్భుతంగా జరిగింది.
ఎనిమిది దేశాల నుండి 27 వక్తలు, సంధానకర్తలతో సభ కళ కళ లాడింది. ఈ సభలో వంగూరి చిట్టెన్ రాజు, లలిత రామ్, వంశీ రామ రాజు, సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళా సారధి అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, రాధిక మంగిపూడి, షామీర్ జానకీ దేవి, శ్రీహవిష దాస్ మరియు తెలుగు సాహిత్య ప్రపంచం లోని అతిరధ, మహారధులు పాల్గొన్నారు. మహాకవులు, రచయితలు, వాగ్గేయకారులు, వారి రచనల పై ఉత్తేజమైన ప్రసంగాలు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి.
కల్చరల్ టీ వీ వారు ప్రసారం చేసిన ఈ సమావేశాన్ని యూట్యూబ్ లో వీక్షించగలము.