శివ కార్తికేయన్ హీరోగా నటించిన చిత్రం అయలాన్. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఆర్.రవికుమార్ దర్శకత్వం. ఈ చిత్రాన్ని కేజేఆర్ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కించగా సంక్రాంతి కానుకగా ఈ నెల 12న తమిళనాడులో విడుదలైంది. అయలాన్ అంటే ఏలియన్ (గ్రహాంతరవాసి). గ్రహాంతరవాసి కాన్సెప్ట్‌తో దక్షిణాది భాషల్లో సినిమా రావడం ఇదే ప్రప్రథమం. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న తెలుగులో విడుదల చేయనున్నట్లు గంగ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ తెలిపింది. వరుణ్ డాక్టర్ సినిమా తర్వాత శివ కార్తికేయన్, కేజేఆర్ స్టూడియోస్, గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబోలో చిత్రమిది. కార్తికేయన్ నటన, కామెడీ, సినిమా కాన్సెఫ్ట్ తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సైన్స్ ఫిక్షన్ యూనివర్స్ కాన్సెఫ్ట్‌తో వచ్చిన ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్నాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో ఇషా కొప్పికర్, ఫేమ్ శరద్ కేల్కర్, సీనియర్ హీరోయిన్ భానుప్రియ ఇతర తారాగణం. సినిమాటోగ్రఫీ: నీరవ్ షా; కొరియోగ్రఫీ: గణేష్ ఆచార్య, పరేష్ శిరోద్కర్, సతీష్ కుమార్; నిర్మాత: కోటపాడి జే రాజేష్; దర్శకత్వం: ఆర్.రవికుమార్.
