సింగపూర్‌లోని వుడ్ లాండ్స్ సెకండరీ స్కూల్ స్పోర్ట్స్ హాల్‌లో తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ – 2023 విజయవంతంగా ముగిసింది. చిల్డ్రన్స్ సింగిల్స్‌లో హర్షిత్ కుమార్ రెడ్డి విజేతగా, రిత్విక్ రెడ్డి రన్నరప్‌గా నిలిచారు. చిల్డ్రన్స్ డబుల్స్ ఫైనల్లో రిత్విక్ రెడ్డి, అజయ్ సాత్విక్ విజయం సాధించారు. ప్రజ్వల్ రాము, భావ దీప్తి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు.
మెన్స్ సింగిల్స్‌లో ఉదయ్ బ్రహ్మానందం విజయం సాధించాడు. సురేష్ పోలుకొండ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. మెన్స్ డబుల్స్‌లో భరద్వాజ్ కేసం శెట్టి, సాయి కృష్ణ సాలేం జోడీ గెలిచింది. అన్నం పవన్ కుమార్, ఉదయ్ బ్రహ్మానందం జంట రెండో స్థానంలో నిలిచింది. ఉమెన్స్ డబుల్స్ పోటీల్లో మాధవి, శ్రీ లక్ష్మీ సత్తా చాటి మొదటి స్థానం సాధించారు. శ్రద్ధ, సంహిత రన్నరప్ ట్రోఫీ అందుకున్నారు. బొడ్డు సత్య సంహిత, సురేష్ పోలుకొండ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలిచారు. అప్- సాయి కృష్ణ, శ్రీ లక్ష్మీ రన్నరప్‌గా నిలిచారు.
టోర్నమెంట్‌కు సమన్వయ కర్తలుగా నర్రా ఆర్ సి రెడ్డి, గార్లపాటి లక్ష్మా రెడ్డి, గర్రేపల్లి శ్రీనివాస్, దుర్గ ప్రసాద్, బొందుగుల రాము, శివ ప్రసాద్ ఆవుల, వెంకట రమణ నంగునూరి, సతీష్ పెసరు, రవి కృష్ణ విజాపూర్, విజయ్ మోహన్ వెంగళ, పెరుకు శివ రామ్ ప్రసాద్, శశిధర్ రెడ్డి, ప్రవీణ్ మామిడాల వ్యవహరించారు. ఈ పోటీలను సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ కుమార్, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షులు గోనె నరేందర్ రెడ్డి, నల్ల భాస్కర్ గుప్తా నిర్వహించారు. టోర్నమెంట్ విజయవంతం కావడానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి, అంపైర్లకు, ప్రత్యేకంగా అన్నే అన్నె వంశీ కృష్ణ (జానిక్), రవి కుమార్ నీరుడు (కుమార్ ప్రాపర్టీస్)లకు సొసైటీ కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ టోర్నమెంట్‌లో సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఆరు విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పోటీపడ్డారు. మెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్, చిల్డ్రన్స్ సింగిల్స్, చిల్డ్రన్స్ డబుల్స్ విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు మాట్లాడుతూ సింగపూర్‌లో తెలంగాణ సంస్కృతిని ముందు తరాలకు అందజేయడానికి పండుగలతో పాటు క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం వివిధ ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ టోర్నీని విజయ వంతం చేసిన క్రీడాకారులందరికి కృతజ్ఞతలు తెలిపారు.