Namaste NRI

వరద బాధితులకు బాహుబలి భారీ విరాళం

సాయం చేయడంలో ప్రభాస్‌ చేయి ఎప్పుడూ పెద్దగానే ఉంటుంది. ఏ కష్టం వచ్చినా కూడా తాను ఉన్నానంటూ ముందు కొస్తుంటారు ప్రభాస్‌. గతంలో ఎన్నోసార్లు సాయం చేసారు ప్రభాస్‌. తాజాగా మరోసారి ఇదే చేస్తారు.  ఆంధ్రప్రదేశ్‌ వరద బాధితుల సహాయార్థం అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ రూ.కోటి విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళం అందజేయనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో వరదలు ముంచెత్తి ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో తన వంతు సాయంగా కోటి రూపాయలు విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో హైదరాబాద్‌ వరదల సమయంలో కూడా రూ.కోటి అందించారు. ప్రభాస్‌ కరోనా సమయంలో 4.5 కోట్ల విరాళమిచ్చిన గొప్ప మనసు చాటుకున్నారు. అదే విధంగా.. వరద బాధితులకు పలువురు కథానాయకులు విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events