Namaste NRI

బాలకృష్ణ అఖండ 2 విడుదల ఆ రోజే

బాలకృష్ణ నటిస్తున్న డివోషనల్‌ యాక్షన్‌ డ్రామా అఖండ 2 – తాండవం. సంయుక్తామీనన్‌ కథానాయిక. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీనాథ్‌ ఆచంట నిర్మిస్తున్న ఈ భారీ పాన్‌ ఇండియా సినిమా డిసెంబర్‌ 5న విడుదల కానుంది. ఈ విషయాన్ని రీసెంట్‌గా పవన్‌కల్యాణ్‌ ఓజీ ప్రీమియర్‌ షోలో మేకర్స్‌ ప్రకటించారు. ఈ క్రమంలో ఈ సినిమా టీజర్‌ను ఓజీ ప్రింట్స్‌కు జతచేసి ప్రదర్శించడం విశేషం.

నిజానికి అఖండ 2 ఈ నెల 25న ఓజీ తోపాటు విడుదల కావాల్సింది. కానీ నిర్మాణంలో జాప్యం కారణంగా సినిమాను వాయిదా వేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ కూడా కంప్లీట్‌ అయ్యింది. ఎట్టకేలకు డిసెంబర్‌ 5న అఖండ 2 – తాండవం రాబోతున్నది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నారు. బాలీవుడ్‌ బాలనటి హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రధారి. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, సమర్పణ: ఎం.తేజస్విని నందమూరి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events