
బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న 111వ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గోపీచంద్ మలినేని దర్శకుడు. నయనతార కథానాయికగా నటిస్తున్నది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ దర్శకుడు బి.గోపాల్ క్లాప్‌నివ్వగా, బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విఛాన్ చేశారు. హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కించనున్న ఈ చిత్రంలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో కనిపిస్తారని, అద్భుతమైన విజువల్స్‌తో పాటు పోరాట ఘట్టాలు అబ్బురపరుస్తాయని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు.
















