నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న అఖండ మూవీ చిత్రీకరణ పూర్తయింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్‌లో సాంగ్ షూట్‌లో చిత్రీకరణ పూర్తిచేసింది యూనిట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలో విడుదల తేదీని ప్రకటించనుంది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, మిర్యాల రవీందర్ రెడ్డి, శ్రీధర్ షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని సింబాలిక్‌గా చూపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు బాలయ్య. ఒక పాత్రలో అఘెరాగా కనిపించనున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగపతి బాబు, శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు.














