Namaste NRI

బాలయ్య కొత్త ప్రయాణం..

నందమూరి బాలకృష్ణను ఇప్పటి వరకు హీరోగా, రాజకీయ నాయకుడిగా చూశాం. ఇప్పుడు ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరించబోతున్నారు నటసింహం. బాలయ్య కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ఓ వైపు వెండితెరపై కథానాయకుడిగా జోరు చూపిస్తూనే ఇప్పుడు ఓటీటీ వేదికగానూ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ప్రముఖ ఓటీటీ వేదిక ఆహా నుంచి ఓ అధికారిక ప్రకటన వెలువడిరది. బాలకృష్ణ తమ ఓటీటీ వేదిక కోసం ఓ టాక్‌ షో చేస్తున్నట్లు సదరు సంస్థ తెలియజేసింది. ఈ  టాక్‌ షో తొలి ఎపిసోడ్‌ దీపావళి సందర్భంగా స్ట్రీమింగ్‌ కానున్నట్లు సమాచారం. దాదాపు పది మందికి పైగా స్టార్లతో ఈ షో తొలి సీజన్‌ను ప్లాన్‌ చేసినట్లు తెలిసింది. ఈ టాక్‌ షో కోసం ఆన్‌ స్టాపబుల్‌ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ప్రచారం వినిపిస్తోంది. మొదటి ఎపిసిడోల్‌లో భాగంగా బాలకృష్ణ మంచు కుటుంబ సభ్యులతో ఈ షోను నిర్వహించనున్నారని సమాచారం. రీసెంట్‌గా అన్నపూర్ణ స్టూడియోలో బాలయ్యతో ఫోటోసూట్‌ కూడా చేశారు. బాలయ్య సరికొత్త లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events