ఇన్‌స్టాగ్రామ్‌పై టర్కీ ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేసింది. ప్రభుత్వ విధించిన షరతులను కంపెనీ అంగీకరిం చి, అధికారులకు సహకరించడంతో తొమ్మిది రోజుల తర్వాత నిషేధం ఎత్తివేస్తున్నట్లు టర్కీ ప్రభుత్వం పేర్కొంది. ఆగస్టు 2న టర్కీ ఇన్‌స్టాగ్రామ్‌ను బ్లాక్ చేసింది. దేశంలోని చట్టాలు, నిబంధనలు, ప్రజల సెన్సిబిలి టీని పాటించడంలో విఫలమైనందుకు పాటించడంలో విఫలమైనందుకు ఇన్‌స్టాగ్రామ్‌పై నిషేధం విధించబ డింది. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియెహ్ హత్యపై సంతాప పోస్ట్‌లను ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్ చేసిందని టర్కీ ఉన్నతాధికారి ఆరోపించారు.
గాజాపై ఇజ్రాయెల్ దాడులను టర్కీ ఖండించింది. వెంటనే కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. ఇజ్రాయె ల్‌కు పశ్చిమ దేశాల బేషరతు మద్దతును విమర్శించింది. భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్, ఇండోనేషి యా తర్వాత టర్కీ 57 మిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులతో టాప్-5లో ఉన్నది. ఇన్‌స్టాగ్రామ్ అధికారులతో చర్చల ఫలితంగా, కేటలాగ్ నేరాలు, వినియోగదారులపై విధించిన సెన్సార్‌షిప్‌లకు సంబం ధించి మా డిమాండ్లను నెరవేర్చడానికి కలిసి పని చేస్తామని హామీ ఇచ్చినందున నిషేధాన్ని ఎత్తివేస్తున్నామ ని రవాణా, మౌలిక సదుపాయాల మంత్రి అబ్దుల్‌కదిర్ తెలిపారు.