ఆక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి మరోసారి మెరుస్తున్నారు. వీరిద్దరు సోగ్గాడే చిన్ని నాయనా కు స్రీక్వెల్‌గా రాబోతున్న బంగార్రాజులో నటిస్తున్నారు. కల్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. అందులో కుర్ర బంగార్రాజుగా నాగ చైతన్య సందడి చేస్తున్నారు. నేడు టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. అన్ని రకాల కమర్షియల్ అంశాలతో రాబోతోన్న బంగార్రాజు చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తున్నారు. నాగ చైతన్యకు జోడిగా కృతి శెట్టి కనిపిచనున్నారు. సత్యానంద్ స్కీన్ర్ ప్లేను అందిస్తుండగా సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)