Namaste NRI

మాట ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ- దసరా సంబరాలు

మన అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ( మాటా) ఆధ్వర్యంలో బతుకమ్మ`దసరా  మహోత్సవాలు ఘనంగా జరిగాయి. న్యూజెర్సీలోని రాయల్‌ ఆల్బర్ట్స్‌ ప్యాలెస్‌లో జరిగిన ఈ వేడుకలకు 3,000 మందికి పైగా తెలుగు ప్రవాసులు తమ కుటుంబ సభ్యులతో హాజరై సంబరాలను అద్భుతంగా మలిచారు. వేడుకల్లో దుర్గా పూజ, బొమ్మల కొలువు, సాంస్కృతిక ప్రదర్శనలు, వాణిజ్య ప్రదర్శనలు, బతుకమ్మ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన 25 అడుగుల ఎత్తయిన బతుకమ్మ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ బతుకమ్మ న్యూజెర్సీలోనే కాదు, అమెరికా వ్యాప్తంగా అత్యంత ఎత్తయిన బతుకమ్మగా చరిత్రలో నిలిచింది. ఇండియన్‌ ఐడల్‌ ఫేమ్‌ యుతి హర్షవర్ధన్‌, మహిళా కమిటీ చైర్‌, గాయని, యాంకర్‌ దీప్తి నాగ్‌ భక్తి గీతాలతో అలరించారు. నిమజ్జన శోభాయాత్రలో సన్నాయి, నాదస్వరాలు, డప్పులతో తెలంగాణ సంప్రదాయ ఘనత ప్రతిధ్వనించింది.

ఈ వేడుకలకు మాటా స్థాపకులు, ఆడ్వైజరీ కౌన్సిల్‌ సభ్యులు శ్రీనివాస్‌ గనగోని, ప్రదీప్‌ సమల, ఆడ్వైజరీ కౌన్సిల్‌ సభ్యులు జితేందర్‌ రెడ్డి మార్గదర్శకత్వం వహించారు. అలంకరణల కోసం గిరిజా మాదసికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. బొమ్మలకొలువు ప్రదర్శనలో సురేష్‌ కజానా, రంగ మడిసెట్టి బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 25 మందికిపైగా మహిళలు అడుగు ఎత్తయిన బతుకమ్మలు తీసుకురావడంతో వారికి ప్రత్యేక బహుమతులుగా చీరలను అందజేశారు.

ఈ వేడుక విజయవంతం కావడంలో న్యూజెర్సీ ఆర్వీపీలు వేణు గిరి, నరేందర్‌ రెడ్డి, ఎర్రంగూరి, దీపక్‌ కట్ట, పూర్ణ బేదుపూడి కీలక పాత్ర పోషించారు. బాబుజీ పెండ్యాల, నరేందర్‌ రెడ్డి, దీపక్‌ కట్ట, కృష్ణ సిద్ధాడ, అరుంధతి శకెళ్లి, లక్ష్మీకాంత గజుల, గోపీ వుటుకూరి, మధు కుంకు, పద్మిని ధర్మపురి, సిద్ధార్థ్‌ తమ్మ, పురుషోత్తం అనిమోలు అహర్నిశలు శ్రమించారు.

ఈ వేడుకల్లో మాటా అధ్యక్షుడు రమణ కిరణ్‌ దుద్దాగి, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రవీణ్‌ గూడూరు, జనరల్‌ సెక్రటరీ విజయ్‌ భాస్కర్‌ కలాల్‌, స్పిరిచ్చువల్‌, మెంబర్షిప్‌ డైరెక్టర్‌ శిరీష గుండపునేని, స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ సురుష్‌ కజానా, హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ డైరెక్టర్‌ సరస్వతి, బోర్డు ఆఫ్‌ డైరెక్టర్‌ రామ్మోహన్‌ చిన్నాల ముఖ్య భూమిక పోషించారు. ఆనరరీ అడ్వైజర్లలో దాము గేదేల, జైదీప్‌ రెడ్డి, వెంకటేష్‌ ముత్యాల, బాలాజీ జిల్ల తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events