జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో బతుకమ్మ వేడుకలను కన్నులపండువగా నిర్వహించారు. బతుకమ్మ పాటలతో పరిసరాలు మార్మోగాయి. ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది ఉయ్యాల పాటలు పాడారు. ఈ వేడుకల్లో సుమారు 200 మందికి పైగా ఎన్నారై మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకుడు ఆనంద్ మాట్లాడుతూ బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని నిర్వాకులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల్లో స్థిరపడిన తెలంగాణ, తెలుగు వాసులు కూడా బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. మ్యూనిచ్లో జరిగిన బతుకమ్మ సంబురాలు జర్మనీలోని ఇతర నగరాలకు స్ఫూర్తినిచ్చాయని తెలిపారు. అనంతరం నిర్వాహకులు అరవింద్, నరేష్, శ్రీనివాస్, వికాస్, సుజిత్, మహేష్, దేవేందర్, శివ, గిరీష్, రమేష్, అనిల్ ఈ కార్యక్రమం విజయవంతం కావడంపై ఆనందం వ్యక్తం చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)