తెలంగాణా అసోసియేషన్ ఆఫ్ ఉగాండా ఆధ్వర్యంలో ఉగాండా రాజధాని కంపాలాలో ఘనంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు మహిళలు ఉయ్యాల పాటలు పాడుతూ ఆటలాడారు. చిన్నా పెద్ద అంతా కలిసి సంబురాల్లో పాల్గొన్నారు. పూలపండుగ, తెలంగాణ సంస్కృతిని స్థానికులు చూసి ముచ్చటపడ్డారు. మున్ముందు జరిగే వేడుకల్లో తాము భాగస్వాములవుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కవితా, వాణి, విద్య, హిరణ్మయి, సబితా, దివ్య, అశ్విని, గాయత్రీ, సుష్మ, పూజిత, స్వాతి లలిత, ఉమా రమా, విజయ, చందన, హరిశ తదితరులు పాల్గొన్నారు.