లండన్ తెలంగాణ సంఘం (టాక్) ఆధ్వర్యంలో లండన్ లోని టవర్ బ్రిడ్జి ప్రతిమ వద్ద చేనేత బతుకమ్మ ఉత్సవాలను జరిపారు. భారత సంతతికి చెందిన బ్రిటన్ ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమా మల్హోత్రా, హౌంస్లౌ మేయర్ బిష్ణుగురుగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో క్రియాశీలకంగా పాల్గొంటారని, వీరి స్ఫూర్తి గొప్పదని తెలిపారు. టాక్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. టాక్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఇతర నేతలు ఎస్.రెడ్డి, సత్య మూర్తి, అశోక్, సురేశ్, జాహ్నవి తదితరులు ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయి. తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో లండన్‌లోని మరో ప్రాంతంలో బతుకమ్మ, దసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు.