అమెరికా అధ్యక్షుడుడొనాల్డ్ ట్రంప్‌కు, ప్రఖ్యాత మీడియా సంస్థ బీబీసీ క్షమాపణలు చెప్పింది. ట్రంప్ ప్రసంగాన్ని తప్పుగా ఎడిట్ చేసి ప్రసారం చేసినట్లు బీబీసీపై ఆరోపణలు ఉన్నాయి. 2021 జనవరి 6వ తేదీన ఆయన చేసిన ప్రసంగాన్ని బీసీసీ ఛానల్‌లో ప్రసారం చేయడం వల్లే క్యాపిటల్ హిల్‌లో అల్లర్లు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కొన్ని రోజుల క్రితం బీసీసీలో ఉద్యోగం చేస్తున్న ఇద్దరు ఉన్నత వ్యక్తులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తమ ప్రోగ్రామ్‌తో ట్రంప్ పేరుప్రఖ్యాతలకు నష్టం కలిగేలా ప్రవర్తించలేదని బీసీసీ వెల్లడించింది. ట్రంప్ దాఖలు చేసిన బిలియన్ డాలర్ల నష్టపరిహారం కేసును బీబీసీ తోసిపుచ్చింది.

ఈ నేపథ్యంలో బీసీసీ చైర్మెన్ సమిర్ షా , వైట్‌హౌజ్‌కు ప్రత్యేకంగా లేఖ రాశారు. ట్రంప్ ప్రసంగాన్ని ఎడిట్ చేసిన అంశంలో తనతో పాటు సంస్థ క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. తాము ప్రసారం చేసిన ఆ వివాదాస్పద డాక్యుమెంటరీని మళ్లీ ప్రసారం చేసే ప్రణాళిక లేదని బీసీసీ వెల్లడించింది. తాము ఎడిట్ చేసిన ట్రంప్ ప్రసంగం తప్పుదోవ పట్టించే రీతిలో ఉన్నట్లు అంగీకరిస్తున్నామని బీసీసీ చెప్పింది.















