వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం వెంకటేశ్, ఆయనకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌గా నటిస్తున్న మీనాక్షి చౌదరి లపై ఓ అందమైన పాటను దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రీకరించే పనిలో ఉన్నారు. డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్‌లోని అద్భుతమైన లొకేషన్స్‌లో ఈ పాట చిత్రకరణ జరుగుతున్నది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న ఈ షెడ్యూల్‌లో ఈ ఒక్క పాటను మాత్రమే చిత్రీకరిస్తామని, త్వరలోనే మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలు పెడతామని చిత్ర సమర్పకులు దిల్‌రాజు తెలిపారు. ఐశ్వర్య రాజేష్ మరో కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్రప్రసాద్, సాయికుమార్, నరేష్, వీటీ గణేశ్, మురళీధర్ గౌడ్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: శిరీష్, నిర్మాణం: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్.
