ఆరో తరం (6జీ) ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించటంపై అనేక దేశాలు ప్రయోగాలు చేస్తున్న తరుణంలో జపాన్ కీలక ముందడుగు వేసింది. ప్రపంచంలో మొట్టమొదటి 6జీ డివైస్‌ను ఆ దేశం ఆవిష్కరించింది. 5జీ ఇంటర్నెట్‌తో పోల్చితే 20 రెట్లు అత్యధిక వేగాన్ని కలిగివుండే 6జీ డివైస్‌ను (నమూనా పరికరం) జపాన్‌లోని వివిధ టెలికం కంపెనీలు సంయుక్తంగా తయారుచేశాయి. 300 అడుగల ప్రాంతాన్ని కవర్‌చేసేలా 6జీ సేవల్ని అందించటం ఈ పరికరం ప్రత్యేకత. అయితే అందరూ భావిస్తున్నట్టు, ఈ డివైస్ స్మార్ట్‌ఫోన్ కాదు. ఇదొక ప్రత్యేకమైన పరికరం. భారత్‌లో 5జీ సేవలు కొన్ని నగరాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. దీంట్లో డాటా ప్రసారం 10 నుంచి 20 గిగాబైట్స్. జపాన్ తీసుకొచ్చిన 6జీ డివైస్ 100 గిగాబైట్ల వేగంతో డాటాను ప్రసారం చేయగలదు. ఈ పరికరంతో నెటిజన్ తన టాస్క్‌ను కొన్ని సెకన్లలో పూర్తిచేయగలడు.