విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా బిచ్చగాడు 2. కావ్య థాపర్ నాయికగా నటిస్తున్నది. ఫాతిమా నిర్మాత. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హీరోలు అడివి శేష్, ఆకాష్ పూరి అతిథులుగా హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ తన కూతురి పెండ్లి చేసి అత్తవారింటికి పంపేటప్పుడు తండ్రి ఎలా బాధపడతాడో ప్రతి సినిమాను కష్టపడి రూపొందించి రిలీజ్ చేసేప్పుడు కూడా అలాగే ఉద్వేగానికి లోనవుతుంటాం. తొలి భాగం సినిమాలో ఉన్న ఎమోషన్స్ ఈ చిత్రంలోనూ కనిపిస్తాయి. కొన్నేండ్లుగా తెలుగు ప్రేక్షకులు నన్ను అభిమానిస్తున్నారు.ఈ సినిమా మీద కూడా మీ ఆదరణ చూపిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.


అడివి శేష్ మాట్లాడుతూ మనం కథలు రాసి సినిమాలు చేస్తున్నాం గానీ విజయ్ ఆంటోనీ ఎడిటింగ్, సంగీత బాధ్యతలు కూడా వహిస్తున్నారు. బిచ్చగాడు నా ఫేవరేట్ మూవీ. ఈ సీక్వెల్ కూడా అలాగే ఆకట్టుకుంటుందని కోరుకుంటున్నా అన్నారు. నాయిక . కావ్య థాపర్ మాట్లాడుతూ ఈ చిత్రంలో హేమ పాత్రలో కనిపిస్తాను. ఈ చిత్రంతో నాకు విజయ్, ఫాతిమా రూపంలో మంచి మిత్రులు దొరికారు. ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది అన్నారు. ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో నిర్మాత ఫాతిమా విజయ్, గీత రచయిత భాషా శ్రీ, డిస్ట్రిబ్యూటర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.
