Namaste NRI

రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ సరసాలు చాలు ప్రారంభం

సికె ఇన్ఫిని సమర్పణలో మూన్‌ వాక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నరేష్‌ అగస్త్యా, సంజన సారధి జంటగా డాక్టర్‌ సందీప్‌ చేగూరి దర్శకత్వంలో బి.చంద్రకాంత్‌ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం సరసాలు చాలు. ఈ చిత్రం పూజ కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. జెఆర్‌సి కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో  ముఖ్య  అతిథులుగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమారుడు తలసాని సాయికిరణ్‌ యాదవ్‌ చిత్ర యూనిట్‌కు  స్క్రిప్ట్‌ను అందించారు. చిత్ర నిర్మాత భార్య శృతి రెడ్డి హీరో హీరోయిన్‌ లపై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్‌ కొట్టారు. నిర్మాత చంద్రకాంత్‌ రెడ్డి, రోహిత్‌లు కెమెరా స్విచాన్‌ చేశారు. దర్శకుడు అభిలాష్‌ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు డాక్టర్‌ సందీప్‌ చేగూరి మాట్లాడుతూ ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. మంచి రొమాంటిక్‌ కామెడీతో వస్తున్న ఈ చిత్రంలో అద్భుతమైన నాలుగు పాటలు ఉంటాయి. మూడూ షెడ్యూల్లో ఈ సినిమా పూర్తి చేసి సమ్మర్‌లో విడుదల చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బి.చంద్రకాంత్‌ రెడ్డి, నరేష్‌ అగస్త్వ, సంజన సారధి పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : రోహిత్‌ బట్చు, సంగీతం: భరత్‌ మంచిరాజు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events