Skip to main content

Namaste NRI

మెగాస్టార్‌ చిరంజీవిని ఆహ్వానించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫ్యామిలీ!

టాలీవుడ్ యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు. తన జీవితంలో ప్రారంభం కాబోతున్న ఈ కొత్త అధ్యాయం కోసం సాయి శ్రీనివాస్ స్వయంగా రంగంలోకి దిగి సినీ పెద్దలను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా, ఆయన తన తండ్రి ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌తో పాటు కుటుంబ సభ్యులతో కలిసి మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. అక్కడ చిరంజీవికి పెళ్లి పత్రికను అందజేసి, వేడుకకు తప్పకుండా రావాలని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ సాయి శ్రీనివాస్‌ను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యేలా ఈ వివాహ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు బెల్లంకొండ సురేష్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News