అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం వృషకర్మ. మిథికల్ థ్రిల్లర్ కథాంశమిది. కార్తీక్ దండు దర్శకుడు. చిత్ర ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో నాగచైతన్య నిధి అన్వేషకుడి పాత్రలో కనిపించనున్నారు. ఆతీంద్రియ శక్తులు మేల్కొన్నప్పుడు, సృష్టి ధర్మం తప్పినప్పుడు విధి ఒక వృషకర్మని ఎంచుకుంటుంది అనే వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూఇలాంటి మైథలాజికల్ జోనర్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. స్క్రిప్ట్ విన్నప్పుడు గొప్ప చిత్రమవుతుందనే భావన కలిగింది. నా కెరీర్లోనే బెస్ట్ మూవీ అవుతుందనే నమ్మకం ఉంది అన్నారు. ఈ సినిమాలోని 30 నిమిషాల ైక్లెమాక్స్ ఘట్టాలు ఇండియన్ సినిమాలో బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తాయని అన్నారు.

ఈ సినిమాలో నాగచైతన్య మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తారని దర్శకుడు కార్తీక్ దండు పేర్కొన్నారు. మీనాక్షి చౌదరి, స్పర్ష్ శ్రీవాస్తవ, జయరామ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ బి లోక్‌నాథ్, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల, నిర్మాతలు: బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బి, దర్శకత్వం: కార్తీక్ దండు.















