Namaste NRI

భగవంత్‌ కేసరి సెకండ్‌ సింగిల్‌

బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం భగవంత్‌ కేసరి.  బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్‌ నటిస్తుంది. అనిల్‌ రావిపూడి దర్శకుడు. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తున్నది.  ఈ సినిమాలోని రెండో గీతం ఉయ్యాలో ఉయ్యాలా ఈ నెల 4న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా  కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణ నది ఒడ్డున కూర్చొని పాపతో సరదాగా నవ్వుతూ కనిపిస్తున్నారు. బాబాయ్‌, కూతురు మధ్య అనుబంధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలిసింది. కూతురు శ్రేయస్సు కోసం ఎంత దూరమైనా వెళ్లే ఓ బాబాయ్‌ కథ ఇదని, యాక్షన్‌తో పాటు హృదయాన్ని కదిలించే భావోద్వేగాలుంటాయని చెబుతున్నారు. అక్టోబర్‌ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: సి.రామ్‌ప్రసాద్‌, సంగీతం: తమన్‌, రచన-దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.

Social Share Spread Message

Latest News