Namaste NRI

భరతనాట్యం..రిలీజ్ ఆరోజే

సూర్యతేజ ఏలే కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం భరతనాట్యం. మీనాక్షి గోస్వామి కథానాయిక.  కేవీఆర్‌ మహేంద్ర దర్శకుడు. పాయల్‌ సరాఫ్‌ నిర్మించారు. ఈ  చిత్రం లో వైవా హర్ష, హర్షవర్ధన్‌, అజయ్‌ ఘోష్‌, సలీం ఫేకు, గంగవ్వ తదితరులు నటిస్తున్నారు.  ఈ సినిమాలోని చేసావు ఏదో మాయ అనే గీతాన్ని విడుదల చేశారు. ప్రేమలోని మధుర భావాలకు అద్దం పడుతూ సాగే రొమాంటిక్‌ గీతమిదని చిత్రబృందం తెలిపింది. ఈ కథలో హీరో ఔత్సాహిక ఫిల్మ్‌మేకర్‌ పాత్రలో కనిపిస్తారని, ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. ఈ  చిత్రం ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ ఆర్‌ శాఖమూరి, సంగీతం: వివేక్‌సాగర్‌, కథ: సూర్యతేజ ఏలే, స్క్రీన్‌ప్లే: సూర్యతేజ ఏలే, కేవీఆర్‌ మహేంద్ర, దర్శకత్వం: కేవీఆర్‌ మహేంద్ర.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events