మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకుడు. రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రం విడుదల తేదీ ఖారారైయింది. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సోమవారం (ఆగస్టు 22) మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా భోళా శంకర్ బ్రాండ్ న్యూ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్‌గా నడుస్తూ ట్రైడెంట్ కీచెన్‌కి తిప్పతూ కనిపించారు. ఇప్పటికే నలభైశాతం చిత్రీకరణ పూర్తయింది. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే ఎమోషనల్ ప్యామిలీ ఎంటర్‌టైనర్‌ది. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తుండగా, తమన్నా మరో ప్రధానా పాత్రలో ఇందులో కనిపించనుంది. రఘుబాబు, రావు రమేష్, మురళీశర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కిషోర్ గరికిపాటి, సంగీతం: మహతి స్వర సాగర్, కెమెరా: డూడ్లే, లైన్ ప్రొడక్షన్: మోహర్ క్రియేషన్స్. సంభాషణలు : తిరుపతి మామిడాల.