టాలెంటెడ్ యాక్టర్ సునీల్ వన్ ఆఫ్ ది లీడ్ రోల్‌లో నటిస్తోన్న తాజా చిత్రం భువన విజయం. శ్రీమతి లక్ష్మి సమర్పణలో హిమాలయ స్టూడియో మ్యాన్షన్స్ బ్యానర్‌పై కిరణ్, వీఎస్‌కే తెరకెక్కిస్తున్నారు. క్రైం కామెడీ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను యలమంద చరణ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో థర్టీ ఇయర్స్ పృథ్వి, ధన్ రాజ్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. తెల్ల లుంగీ, థిక్ బ్లూ షర్ట్‌లో ఉన్న సునీల్ ఛైర్‌పై సీరియస్ లుక్‌లో కనిపిస్తుండగా, పక్కనే పృథ్విరాజ్ కంప్లీట్ వైట్ డ్రెస్‌లో కనిపిస్తున్నాడు. మరోవైపు వెన్నెల కిశోర్ తన స్టైల్‌లో కొంచెం సీరియస్ యాంగిల్‌లో కనిపిస్తున్నాడు. వివిధ పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన లుక్స్‌తో సినిమా ఎలా ఉండబోతుందనే దానిపై కొంత హింట్ ఇచ్చినా, ఇంతకీ ఎలాంటి స్టోరీతో వినోదాన్ని అందించబోతున్నాడన్నది మాత్రం సస్పెన్స్ నెలకొంది. మరి దీనిపై రాబోయే రోజుల్లో ఏదైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.