అమెరికాలో యాపిల్ వాచీల అమ్మకాలపై బైడెన్ సర్కార్ నిషేధం విధించింది. వాచీల పేటెంట్ విషయంలో మెడికల్ మానిటరింగ్ టెక్నాలజీ కంపెనీ మాసిమో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా యాపిల్ వాచీల దిగుమతిని అడ్డుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ యాపిల్ కంపెనీ కోర్టును ఆశ్రయించింది. వాచీల దిగుమతి, అమ్మకాలపై నిషేధాన్ని ఆపాలని అప్పీల్స్ కోర్టులో యాపిల్ సంస్థ పిటీషన్ దాఖలు చేసింది. సిరీస్ 9, ఆల్ట్రా 2 వాచీల అమ్మకాలు, దిగుమతిపై బ్యాన్‌ను ఎత్తివేసేందుకు వైట్‌హౌజ్ నిరాకరించిన విషయం తెలిసిందే. డివైస్ మేకర్ మాసిమో కంపెనీకి చెందిన టెక్నాలజీ, స్టాఫ్‌తోనే యాపిల్ సంస్థ వాచీలు తయారు చేసినట్లు అమెరికా అంతర్జాతీయ వాణిజ్య సంఘం యాపిల్ సంస్థపై చర్యలు తీసుకున్నది. ఇంటర్నేషనల్ ట్రేడ్ కమీషన్ ఇచ్చిన తీర్పును యాపిల్ సంస్థ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ ఉద్యోగుల్ని యాపిల్ కంపెనీ కిరాయి తీసుకున్నదని, పల్స్ ఆక్సీమీటర్ టెక్నాలజీని దొంగలించారని, ఆ టెక్నాలజీని యాపిల్ వాచీలో వాడారని మాసిమో కంపెనీ ఆరోపిస్తున్నది.