అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లిరువురూ మిచిగన్ ప్రైమరీలో వారి వారి పార్టీల తరపున విజయం సాధించారు. ఈ ఏడాది నవంబరులో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే దిశగా ఇరువురు ముందుకు సాగుతున్నారు. ప్రధాన ప్రత్యర్ధి, ఇండియన్ అమెరికన్ నిక్కీ హేలీని ట్రంప్ అతి సునాయాసంగా ఓడించారు. తద్వారా రిపబ్లికన్ పార్టీ నామినేషన్‌ను పొందడానికి మరో అడుగు ముందుకేశారు. నిక్కీ హేలీకి 28.9శాతం ఓట్లు రాగా, ట్రంప్‌కు 66.4శాతం ఓట్లు లభించాయి. తనను గెలిపించిన మిచిగన్ ఓటర్లకు బైడెన్ కృతజ్ఞతలు తెలియచేశారు.