ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ కొన్ని దేశ రహస్య పత్రాలను 2017 వరకు ఉద్దేశపూర్వకంగా తన ఇంట్లో అట్టిపెట్టుకోవడంతోపాటు ఆ పత్రాల్లోని సమాచారాన్ని ఇతరులతో పంచుకున్నట్టు స్పెషల్ కౌన్సెల్ రాబర్ట్ హుర్ తన సంచలన నివేదికలో స్పష్టం చేశారు. అంతేకాకుండా జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్న వృద్ధుడుగా బైడెన్‌ను అభివర్ణించారు. వయసు రీత్యా వచ్చే సమస్యల వల్ల బైడెన్ (81) జ్ఞాపకశక్తి లో అనేక లోపాలను గుర్తించినట్టు వెల్లడించారు. కాగా, హుర్ నివేదికను బైడెన్ తీవ్రంగా ఖండించారు. తన జ్ఞాపకశక్తిలో ఎలాంటి లోపాలు లేవని, ఎలాంటి రహస్య సమాచారాన్నీ తాను ఇతరులతో పంచుకోలేదని చెప్పారు.
