Namaste NRI

బిగ్‌ బ్రదర్‌ ప్రీరిలీజ్‌ వేడుక

శివ కంఠంనేని కథానాయకుడిగా గోసంగి సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం బిగ్‌ బ్రదర్‌. కె.శివశంకర్‌రావు, ఆర్‌.వెంకటేశ్వరరావు నిర్మాతలు. ఈ సందర్భంగా ప్రీరిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ప్రముఖ నటులు మురళీమోహన్‌, నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఎల్‌.దామోదరప్రసాద్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రభు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కి శభాకాంక్షలు అందించారు. ఈ సినిమాలో నటించడం పట్ల హీరో శివ కంఠంనేని ఆనందం వెలిబుచ్చారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌ని ఇష్టపడేవారికి బిగ్‌ బ్రదర్‌ తప్పకుండా నచ్చుతుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా చిత్ర యూనిట్‌ అంతా మాట్లాడారు. ఈ నెల 24న సినిమా విడుదల కానుంది.  ఈ చిత్రానికి కెమెరా: ప్రకాశ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress