ట్విటర్, టెస్లా, సంస్థల అథినేత ఎలాన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. టెస్లా షేర్ల భారీ పతనం తో మస్క్ ఒక్కరోజే ఏకంగా 20.3 బిలియన్ డాలర్ల (అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1.64 లక్షల కోట్లకు పైమాటే) సంపదను కోల్పోయారు. అయినప్పటికీ ఇంకా ప్రపంచ కుబేరుల జాబితాలో మస్క్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ధరలను మరింత తగ్గించాలని యోచిస్తున్నట్లు టెస్లా ప్రకటించింది. వడ్డీ రేట్లు ఇలా కొనసాగితే విద్యుత్ వాహనాల ధరలను మరింత తగ్గించక తప్పదని మస్క్ వెల్లడిరచారు. దీంతో అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్ ట్రేడిరగ్‌లో ఈ కంపెనీ షేర్ల ధర భారీగా పతనమైంది. షేరు ధర ఏకంగా 9.7 శాతం కుంగింది. దీంతో ఒక్కరోజే ఎలాన్ మస్క్ సంపదలో 20.3 బిలియన్ డాలర్లు ఆవిరయ్యాయి.
