Namaste NRI

బ్యూటిఫుల్‌ ప్రధానికి కోర్టులో బిగ్‌ షాక్‌

థాయ్‌ల్యాండ్‌ ప్రధాని పెటంగ‌టార్న్ షిన‌వ‌త్రా కు గట్టి షాక్‌ తగిలింది. పొరుగుదేశమైన కాంబోడియా ప్రధానితో జరిపిన ఫోన్‌ సంభాషణపై షినవత్రాపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ఆ దేశ రాజ్యాంగ కోర్టు ఆమెను సస్పెండ్‌ చేస్తూ ఇటీవలే తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. తాజాగా చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆమెను పదవి నుంచి తొలగిస్తూ తీర్పు చెప్పింది. ఆమె నియమాలను ఉల్లంఘించారని, రాజ్యాంగం ప్రకారం ప్రధాన మంత్రి పదవికి అనర్హురాలని పేర్కొంది.

ఓ ఫోన్‌ సంభాషణలో కంబోడియా మాజీ అధినేత హున్‌సేన్‌ను అంకుల్‌ అని సంబోధించిన పెటంగ‌టార్న్ షినవత్రా‌,  తమ దేశ సైనిక కమాండర్‌ను తన విరోధి అని పేర్కొనడం వివాదానికి దారితీసింది. దేశ సరిహద్దుల్లో కంబోడియాతో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో స్వయంగా ప్రధాని తమ దేశ సైనిక కమాండర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. దీనిపై గత నెల విచారణ చేపట్టిన కోర్టు,  కంబోడియాతో జరిగిన దౌత్య వ్యవహారంలో ప్రధానమంత్రిగా నైతికతను ఉల్లంఘించారని చెప్పడానికి తగిన ఆధారాలున్నాయని పేర్కొన్నది. ప్రధానమంత్రి ప‌ద‌వి నుంచి సస్పెండ్‌ చేస్తూ రాజ్యాంగ కోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. 

Social Share Spread Message

Latest News