Namaste NRI

అమెరికాలో మరోసారి మతోన్మాదం

అమెరికాలో మరోసారి ఉన్మాదపు తూటా పేలింది. విందు వినోదాలతో సాగుతున్న పిట్స్‌బర్గ్ శివార్లలోని బార్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోగా. ఏడుగురు గాయపడ్డారు. బల్లెర్‌స హూక్కా లాంజ్, సిగార్ బార్ నుంచి తమకు కాల్పుల సంఘటన గురించి ఫోన్లు వచ్చాయని అలిగెనీ కౌంటీ పోలీసు విభాగం తెలిపింది. తెల్లవారుజామున అక్కడి బారులో , సమీపంలోని హుక్కా సెంటర్‌లో మత్తోన్మాద చర్య జరిగిందని పోలీసుల కథనంతో వెల్లడైంది.

బార్ లోపల పెద్ద వయస్సున్న ఓ ఆడ, మగ పడి ఉండగా గుర్తించారు. పలుగాయాలతో ఉన్నవారిని కూడా కనుగొన్నారు. బార్ లోపల ఏదో విషయంపై తగవు ఏర్పడి ఉంటుందని, ఈ దశలో పలువురు నడుమ పరస్పర కాల్పులు జరిగి ఉంటాయని ప్రాధమిక సమాచారం మేరకు పోలీసులు తేల్చారు. ఘటనకు సంబంధించి ఎవరిని అయినా అరెస్టు చేశారా? బాధితులు ఎవరు? అనే విషయాలు పోలీసు వర్గాల నుంచి వెలువడలేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events