Namaste NRI

ద్విభాషా చిత్రం.. కీలక పాత్రలో సునీల్‌

ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కనున్నది. ఈ సినిమాలో నటుడు సునీల్‌ కీలక పాత్ర పోషించనున్నట్టు మేకర్స్‌ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఇందులో సునీల్‌ పోషించనున్న పాత్ర చాలా ప్రత్యేకమైనదని, హాస్యంతోపాటు హృద్యమైన భావోద్వేగాల కలగలుపుగా ఈ పాత్ర డిజైన్‌ చేయడం జరిగిందని, సునీల్‌లోని కొత్తకోణం ఆవిష్కృతమయ్యేలా ఈ పాత్ర ఉంటుందని, ఈ నెల 15న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక టైటిల్‌ని ప్రకటిస్తామని మేకర్స్‌ తెలిపారు. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేయనున్న ఈ చిత్రం రఫ్‌ నోట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మితం కానున్నది.

Social Share Spread Message

Latest News