Namaste NRI

ఆంధ్రప్రదేశ్ పర్యటనలో బిల్ గేట్స్, RTGSను సందర్శించి అభినందనలు

ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బిల్ గేట్స్ ముఖ్యమంత్రి మంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కమాండ్ సెంటర్ (RTGS)ను సందర్శించారు. ఆర్ టిజిఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు వేగంగా అందిస్తున్న విదానం, ఫలితాలను గేట్స్ కు చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. డాటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానం చేశామని సియం వివరించారు. డాటాలేక్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు సులభతరం చేయడం బాగుందని ఈ సందర్భంగా బిల్ గేట్స్ సియంని అభినందించారు.

అంతకుముందు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నపుడు గేట్స్ బృందానికి మొదటి బ్లాక్ వద్ద గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు స్వాగతం పలికారు. బిల్ గేట్స్‌కు సీఎం మంత్రులను పరిచయం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events