రంజిత్, సౌమ్యమీనన్ జంటగా నటిస్తున్న చిత్రం లెహరాయి. రామకృష్ణ పరమాహంస దర్శకుడు. ఎస్.ఎల్.మూవీస్ పతాకంపై మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మించారు. బెక్కం వేణుగోపాల్ సమర్పకుడు. గగన్ విహారి, రావు రమేష్, నరేష్, అలీ ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. బింబిసార దర్శకుడు వశిష్ట ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీజర్ ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ మంచి కథతో వస్తున్న రూపొందిన సినిమా ఇది. బెక్కం వేణుగోపాల్ కొత్తతరాన్ని ప్రోత్సహిస్తుంటారు. ఘంటాడి కృష్ణ పాటలు బాగున్నాయి అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా తెరకెక్కించాం. యువతకు బాగా నచ్చుతుంది. ప్రేమ ప్రయాణంలోని అనుభూతులకు అద్దం పడుతుంది. నేటి యువతీ యువకులకు, విద్యార్థులకు ఈ సినిమా ద్వారా మంచి సందేశాన్నిచ్చాం అన్నారు. మంచి కంటెంటెతో సినిమా తీశామని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శకుడు నిర్మాత పేర్కొన్నారు. పాటలన్నీ శ్రోతలకు చేరువయ్యాయని సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ, నటి సంద్య జనక్ తదితరులు పాల్గొన్నారు.