Namaste NRI

తెరపైకి మాజీ ప్రధాని జీవితకథ

దివంగత భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందనుంది. మై రహూ యా నా రహూ ఏ దేశ్‌ రెహనా చాహియే అటల్‌ టైటిల్‌తో వినోద్‌ భన్సాలీ, సందీప్‌ సింగ్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించి గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఉల్లేక్‌ ఎన్‌పీ రాసిన ది అన్‌టోల్డ్‌ వాజ్‌పేయి. పొలిటీషియన్‌ అండ్‌ పారాడాక్స్‌ పుస్తకం అధారంగా గా చిత్రం తెరకెక్కనుంది. తాజాగా ఈ పుస్తక హక్కులను దక్కించుకున్నట్లు నిర్మాతలు వినోద్‌ భానుషాలి, సందీప్‌ సింగ్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత వినోద్‌ మాట్లాడుతూ వాజ్‌పేయికి నేను వీరాభిమానిని. మన దేశ నిర్మాణానికి ఆయన చేసిన కృషి ఎనలేనిది. అందుకే ఆయన వారసత్వాన్ని వెండితెరపైకి  తీసుకురావడాన్ని మేము గొప్ప గౌరవంగా భావిస్తున్నాం అన్నారు. భారతీయ చరిత్రలోని గొప్ప నాయకులలో అటల్‌ బిహారి వాజ్‌పేయి ఒకరు. ఈ  సినిమాలో ఆయన రాజకీయ సిద్ధాంతాలనే కాక మానవీయ, కవితా కోణాల్ని ఆవిష్కరించనున్నాం.  ఇంకా దర్శకుడు ఖరారు కాలేదు. అలాగే నటీ నటులు, సాంకేతిక నిపుణులను కూడా ఖరారు చేయలేదు. వచ్చే ఏడాది ప్రథమార్థలో షూటింగ్‌ ఆరంభించి, క్రిస్మస్‌కి విడుదల చేయాలనుకుంటున్నారు. అటల్‌ పుట్టిన రోజు డిసెంబర్‌ 25. వచ్చే ఏడాది 99వ జయంతి సందర్భంగా అటల్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events