Namaste NRI

బర్త్ డే స్పెషల్..నిఖిల్ స్వయంభు నుంచి కొత్త పోస్టర్ రిలీజ్

 హీరో నిఖిల్‌ నటిస్తున్న చిత్రం స్వయంభు. లెజెండరీ యోధునిగా ఇందులో నిఖిల్‌ కనిపించనున్నారు. భరత్‌ కృష్ణమాచారి దర్శకుడు. భువన్‌, శ్రీకర్‌ నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. నిఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. నిఖిల్‌, సంయుక్త మీనన్‌ యుద్ధం చేస్తూ ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. సినిమా గ్రాండ్‌ స్కేల్‌ని ప్రజెంట్‌ చేసేలా ఈ పోస్టర్‌ ఉన్నది.

న్యాయమైన నాయకత్వానికి ఉదాహరణగా, నీతిమంతమైన పాలనకు చిహ్నంగా నిలిచిన సెంగోల్‌ ఈ పోస్టర్‌ నేపథ్యంలో కనిపించడం ఆసక్తికరంగా ఉంది.  ఇటీవల ప్రధాని నరేంద్ర మోడి సైతం భారతీయ వారసత్వానికి నివాళులర్పిస్తూ కొత్త పార్లమెంట్‌ భవనంలోని స్పీకర్‌ సీటు దగ్గర ఈ సెంగోల్‌ను ప్రతిష్టించారని నిర్మాతలు గుర్తు చేశారు. అద్భుతమైన కథతో శక్తివంతమైన నేపథ్యాల చుట్టూ ఈ కథ నడుస్తుందని మేకర్స్‌ తెలిపారు. నభా నటేష్‌ మరో కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: విజయ్‌ కామిశెట్టి, కెమెరా: కె.కె.సెంథిల్‌ కుమార్‌, సంగీతం: రవి బస్రూర్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాణం: పిక్సెల్‌ స్టూడియోస్‌.

Social Share Spread Message

Latest News