గూగుల్‌లో రాజకీయ ప్రకటనలు ఇచ్చే విషయంలో కేంద్రంలోని అధికార బీజేపీ ముందున్నది. గూగుల్, ఆ సంస్థ వీడియో ఫ్లాట్‌ఫాం యూట్యూబ్‌పై ప్రకటనలకు 100 కోట్లపైగా ఖర్చు చేసిన దేశంలోనే తొలి పార్టీగా బీజేపీ నిలిచింది. 2018, మే 31-2024, ఏప్రిల్ 25 మధ్య కాలంలో డిజిటల్ క్యాంపెయిన్ (రాజకీయ ప్రకటనలు) కోసం అధికార బీజేపీ దాదాపు రూ.101 కోట్లు ఖర్చు చేసిందని, ఇది అన్ని పార్టీల మొత్తంలో (రూ.390 కోట్లు) 26 శాతమని గూగుల్ యాడ్స్ ట్రాన్స్‌పరెన్సీ సెంటర్ డాటాను ఉటంకిస్తూ ఇండియా టుడే వెల్లడించింది. గూగుల్ యాడ్స్‌పై వ్యయంలో రూ.45 కోట్లతో ప్రతిపక్ష కాంగ్రెస్ రెండో స్థానంలో ఉండగా, తర్వాతి స్థానంలో డీఎంకే (రూ.42 కోట్లు) ఉన్నది.