ట్విట్టర్ సహవ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జాక్ డోర్సే తన కొత్త సామాజిక మాధ్యమాన్ని పరిచయం చేశారు. కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫాం బ్లూస్కై బీటా వర్షెన్‌ను విడుదల చేశారు. ట్విట్టర్‌కు పోటీగా అభివృద్ధి చేసిన బ్లూస్కై యాప్ యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇన్విటేషన్ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉన్నది.ట్విట్టర్‌లో ఉన్నప్పటి నుంచే ఆయన ఈ ప్రయత్నాలను ప్రారంభించారు. 2021లో ట్విట్టర్ నుంచి బయటకు వచ్చాక పూర్తిస్థాయిలో బ్లూస్కైను అభివృద్ధి చేశారు. ట్విట్టర్‌కు తమ యాప్ ప్రత్యామ్నాయంగా ఆయన చెప్తున్నారు. ఇందులో 256 అక్షరాలతో పోస్ట్ చేయడానికి వీలుంటుంది. ఫొటోలు, వీడియోలు కూడా పోస్ట్ చేయవచ్చు.